కరీంనగర్ జిల్లా: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా గన్నేరువరం మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గంప వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ఏకైక ఆశయంగా.. ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో కదంతొక్కుతున్న కార్యదక్షుడు కేటిఆర్ కి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్,
న్యాత సుధాకర్,పుల్లెల లక్ష్మన్, నక్క మల్లయ్య, కొట్టే భూమయ్య,గొల్లపల్లి రవి, బూర శ్రీనివాస్, ప్రశాంత్ యాదవ్, పాలెపు అజయ్, నగునూరి స్వామి, కుడికందుల అనిల్,మునిగంటి సాయి, బండి తిరుపతి, బత్తుల అంజి, నగునురి మల్లేశం, పరుశురాం, అనిల్, బుర్ర సత్యనారాయణ, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.