కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు శుక్రవారం సమ్మెకు దిగారు. టియుసిసి జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ ఆధ్వర్యంలో సమ్మెకు పూనుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కార్మికుల మూడు నెలల జీతాలు చెల్లించాలన్నారు. ఈపీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలన్నారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులందరికీ ఐడీ కార్డులు అందజేయాలన్నారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు పాల్గొన్నారు.