- ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మానకొండూర్ నియోజకవర్గానికి రెండో విడుతగా 2,27,82,000 రూపాయలు మంజూరైనట్టు మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.
తొలి విడతలో నియోజకవర్గానికి 295 మందికి 56 లక్షల 74వేల రూపాయలు మంజూరు కాగా, రెండో విడతలో 992 మందికి 2 కోట్ల 27 లక్షల 82 వేలను కలుకొని ఇప్పటి వరకు మొత్తం 2,84,56,000 రూపాయల చెక్కులు మంజూరైనట్టు ఎమ్మెల్యే వివరించారు. మానకొండూర్ మండలంలో 249 మందికి 53,17,000, శంకరపట్నంలో 175 మందికి 39,73,500 రూపాయలు, తిమ్మాపూర్ మండలంలో 178 మందికి 39,51,500 రూపాయలు, గన్నేరువరం మండలంలో 76 మందికి 15,79,500 రూపాయలు, బెజ్జంకి మండలంలో 94 మందికి 24,52,500 రూపాయలు, ఇల్లంతకుంట మండలంలో 160 మందికి 37,99,500 రూపాయల విలువ చేసే చెక్కులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. అలాగే ఇతర నియోజకవర్గాలకు చెందిన 60 మందికి 17,08,500 రూపాయలు విలువ చేసే చెక్కులు వచ్చాయని తెలిపారు. సీఎంఆర్ చెక్కులను మండలాల వారీగా పంపిణీ చేస్తామని, అందరికీ సమాచారం అందించే ప్రక్రియను క్యాంపు కార్యాలయం ద్వారా చేపట్టినట్టు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెండింగ్ లో ఉన్న వాటిని కూడా మంజూరు చేయించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిపారు.