కరీంనగర్ జిల్లా: కరీంనగర్ వన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న చిట్యాల మనోహర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో శనివారం చిగురుమామిడి మండలం గునుకులపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని అరకాలపల్లి లో మృతుని కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మనోహర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తో స్థానిక నాయకులు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ గా వృత్తిపట్ల ఎంతో నిబద్దతతో పని చేస్తూ డ్రైవర్ గా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించేవాడని,ఉద్యోగ రీత్యా ఉమ్మడి జిల్లాల్లో ఏ డిపో కు ట్రాన్స్ఫర్ చేసినా పనిచేసిన చోట మంచి గుర్తింపు తెచ్చుకునే వాడని,ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేర్చే వాడని, ఆర్టీసీకి కూడా నష్టం కలగకుండా చూస్తూ తన వృత్తిని ఎంతో నైపుణ్యతతో, నమ్మకంతో చేసేవాడని అలాంటి వ్యక్తి అదే ఆర్టీసీ డిపోలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత బాధాకరమని, ఆయన మరణం వారి కుటుంబానికి ఎంతో తీరనిలోటని ఆయన కుటుంబాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని,సంస్థ నుండి ఆయనకు రావలసిన అన్ని రకాల బెన్ ఫిట్స్ ఆర్టీసీ అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆర్టీసీ ఉద్యోగి చిట్యాల మనోహర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ తో మాట్లాడి విరి కుమారునికి వెంటనే ఆర్టీసీ లో ఉద్యోగము వచ్చెల కృషి చేస్తానని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, తాజా మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, మాజీ వరుకోలు, ఎంపీటీసీ నిరమల జయరాజు, నాయకులు చిటిమల రవి, దాసరి ప్రవీణ్ కుమార్, చిట్యాల బాల్ రెడ్డి, రాము రెడ్డి, రాజీ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కూన బాలయ్య, చింతపుల నరేందర్, డాక్టర్ రాజేందర్,అందే సురేష్, సాంబమూర్తి బాబు మియా, పరశురాములు, కున సంతోష్, చాన్ చంద్రయ్య, లక్ష్మణ్, సాయన్న, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.