కరీంనగర్ జిల్లా: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అండర్ 14 విభాగంలో గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన హన్మండ్ల అక్షిత్ ఎంపిక అయినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ కోచ్ భక్తు రాజ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లోని మంకమ్మ తోట సిద్ధార్థ స్కూల్లో హన్మండ్ల అక్షిత్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 13 నుండి 15 వరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 22 నుండి 25 వరకు ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారు. అక్షిత్ ఎంపిక పట్ల ఆంధ్ర ప్రదేశ్ సీఎం మీడియా కోఆర్డినేటర్ వర్దేల్లి వెంకటేశ్వర్లు వ్యాయామ ఉపాధ్యాయులు జిట్టవేణి శ్రీను ముదిరాజ్ భక్తు రాజకుమార్ సిద్ధార్థ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి సిద్ధార్థ వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణ్ గణిత ఉపాధ్యాయులు పాము భాస్కర్ బార్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.