కరీంనగర్ జిల్లా: సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని , విద్యార్థులు ఏకాగ్రత తో విద్యను అభ్యసించాలని , అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన మేరకు మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించాలని ఏఎస్సై లక్ష్మి నారాయణ, రాధాకృష్ణ విద్యార్థులకు సూచించారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు ఆగస్టు 15 ను పురస్కరించుకుని గన్నేరువరం పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం గన్నేరువరం, జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జంగపల్లి హైస్కూల్ లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి , షీటీం నిర్వహిస్తున్న విదుల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్,బాడ్ టచ్,గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.