కరీంనగర్ జిల్లా: గౌడ జాతి ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న బహుజన నాయకుడు, నాగుల కనకయ్య గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన నాగుల కనకయ్య గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది, ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని గౌడ మరియు బీసీ కులస్తులందరూ ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ 350 సంవత్సరాలు క్రితమే నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి, బహుజనులందరని ఏకం చేసి నిజాం ప్రభుత్వపైన దండయాత్ర చేసి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప పోరాటయోధుడు ఐన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం అభినందనీయం అన్నారు. కరీంనగర్ జిల్లాల్లో గౌడ మరియు బీసీ సమాజానికి నేను చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.