కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల ఆధ్వర్యంలో డిపార్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం 50 వయస్సు పై బడిన వృద్దులకు వృద్దాప్య వైద్య శిబిరం నిర్వహించారు.ఈ క్యాంప్ నందు రక్తపోటు, మధుమేహం,షుగర్, కీళ్ల నొప్పులు,నడుమునొప్పి, అర్శ మొలలు,ఉచితంగా మందులు పంపిణి చేశారు,ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ సాగర్,జిల్లా ప్రోగ్రాం అధికారి జి.ప్రవీణ్ కుమార్, పార్మాసిస్ట్ లు అనిల్,సుధాకర్ ఎఫ్.ఎన్.ఓ. సుమలత మరియు గ్రామ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.