కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులను హైదరాబాద్ కు వెళ్లకుండా ముందస్తుగా గన్నేరువరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రౌడీలు రాజ్యమేలుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దౌర్జన్యం చేసి కోడిగుడ్లతో బండరాళ్లతో ఇంటి ముట్టడి చేసి ఇల్లు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా గాయపరిచి నష్టం చేయాలని కుట్రతో కౌశిక్ రెడ్డి పై హత్యాప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ గూండా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సుమారు 300 మంది గుండాలను తీసుకువెళ్లి హైదరాబాద్ నడిబొడ్డున అరాచకాలు సృష్టించిన గుండా ఎమ్మెల్యే గాంధీని వెంటనే అరెస్టు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు తో పోలీస్ కమిషనర్ ని సంప్రదిస్తే కాంగ్రెస్ రేవంత్ గుండా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను అరెస్టు చేసి అర్ధరాత్రి దాకా తిప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని కాంగ్రెస్ గుండాల చేతిలో ప్రభుత్వం నడుస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ విషయము అందరికీ గుర్తుంది. మన రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే లేని న్యాయం సామాన్య ప్రజలకు ఉందా అని అన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, అటికం శ్రీనివాస్, గొల్లపల్లి రవి, మీసాల ప్రభాకర్, నగేష్, బోయిని అంజయ్య,ఈదయ్య నాయకులు ఉన్నారు.