కరీంనగర్ జిల్లా: గన్నేరువరం నుంచి మానేర్ వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారని ఇంతవరకూ కూడా ఇచ్చిన హామీ అమలు కాలేదని, వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బ్రిడ్జి శంకుస్థాపన చేయాలని, లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు తో గుణపాఠం చెబుతామని, బ్రిడ్జి జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈకార్యక్రమంలో బ్రిడ్జి జేఏసీ నాయకులు చేర్మైన్ సంపత్ ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షుడు పుల్లెల జగన్, ప్రధాన కార్యదర్శి పుల్లెల రాము, నాయకులు బామండ్ల రవీందర్,పుల్లెల మల్లయ్య, ఘర్షకుర్తి తిరుపతి ,కోడూరు పరుశురాం,వెదిరే రాజయ్య, న్యాత కనకయ్య,వెదిరే బాలయ్య,రామంచ మల్లయ్య, మునిగంటి మధు, న్యాత అంజయ్య, కుమ్మరి మల్లయ్య, జీల చంద్రశేఖర్,పాశం శ్రీనివాస్,కుంభం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.