కరీంనగర్ జిల్లా: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారి ,జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వీర బుచ్చయ్య గన్నేరువరం మండలం లోని ఖాసీంపేట గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. వ్యక్తిగత మరుగుదొడ్డి, రెండవ గుంత నిర్మాణం, డ్రైన్ ఎండ్ సోక్ ఫిట్, వ్యక్తిగత పరిశుభ్రత, ఇంకుడు గుంతల వాడకం పనులను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో ఖాసీంపేట గ్రామం రాష్ట్రంలో ముందంజ లో ఉండడం వలన గ్రామాన్ని సందర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, ఎస్బిఎం రమేష్, వేణు, రవీందర్, కార్యదర్శి ఆనంద్, అంగన్వాడి టీచర్లు శ్యామల, రాజేశ్వరి, సీఏలు సంపత్ కుమార్, పద్మ, వివోలు కవిత, లావణ్య, గ్రామ శానిటేషన్ కమిటీ సభ్యులు పత్తిరి వనిత, చల్లూరి పద్మ,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, జిపి సిబ్బంది పాల్గొన్నారు.