కరీంనగర్ జిల్లా: సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన పులి సంతోష్ గౌడ్ ని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పులి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వానికి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి జాగిరి శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, తనపై నమ్మకం తో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నిలుపుకుంటానని అన్నారు. గౌడ కుల బందవుల అభివృద్ధి విషయంలో గానీ వారికి ఉన్న సమస్యల పట్ల గానీ ముందుండి పోరాడుతానని అన్నారు. జిల్లాలో గౌడ సంఘం అబివృద్దికి సర్వాయి పాపన్న వారసునిగా పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు