- వైభవంగా సాగిన అయ్యప్ప పడిపూజ
- ములుకనూర్ లో మార్మోగిన మణికంఠ నామస్మరణ
- పూజకు తరలివచ్చిన దీక్షాపరులు, భక్తులు
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం చిన్న ములుకనూర్ బస్టాండ్ సమీపంలో అయ్యప్పస్వామి దివ్య పడిపూజ గురుస్వామి కట్టా భాస్కరా చారి ఆధ్వర్యంలో వేదమంత్రాలు పటించగా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ నిర్వహించారు. కన్నెస్వామి వంగపెల్లి సాయికిరణ్-శైలజ దంపతులు నిర్వహించిన ఈ దివ్య పడిపూజ కన్నుల పండుగగా జరిగింది. ఈ దివ్య పడిపూజకు చిగురుమామిడి, తిమ్మాపూర్, కరీంనగర్ మండలాలలోని వివిధ గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. దాసరి ప్రవీణ్ కుమార్ నేత గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఆద్యంతం కన్నులపండువగా సాగింది. దాసరి ప్రవీణ్ నేత గురుస్వామి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామికి వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో, వేద పండితుల మంత్రోచ్చరణల మద్య అయ్యప్పకు అభిషేక కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. ఈ సమయంలో అయ్యప్ప నామస్మరణ చేస్తూ భక్తులు అలాపించిన భజన కీర్తనలు మార్మోగాయి. అనంతరం పేటతుళ్ళి ఆడి అయ్యప్పస్వామి పడిపూజ చేసి తన్మయత్వంతో మునిగి, భక్తులను మైమరపించారు. ఇరుగుపొరుగువారు పోటెత్తినట్లుగా దివ్య పడిపూజ జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని తరించారు. కన్నెస్వామి వంగపల్లి సాయికిరణ్ దంపతులు అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు దక్షిణ తాంబూలాదులను అందచేశారు. ఈ పూజ కార్యక్రమంలో స్వాములు, బండారుపెళ్ళి ఆంజనేయగౌడ్, చెరుకు సంపత్, చిందం శ్రవణ్, కొత్తకొండ ధనుంజయ్, మంద సందీప్, బొడ్ల సాగర్, బొల్లబత్తిని మల్లేశం, నాంపల్లి సతీష్, పొన్నం కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దాసరి ప్రవీణ్ కుమార్ నేత గురుస్వామి మాట్లాడుతూ ప్రతి గ్రామం అయ్యప్ప శరణు ఘోషతో ధర్మరాజ్యం కావాలని ఆకాంక్షించారు. అయ్యప్ప అనే పేరులో కులం, మతం, ప్రాంతం, వర్ణన, వర్గం లేదని అన్నారు. మక్కా, జెరూసలెం వెళ్లాలనుకునే వారికి రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు.. శబరిమలకు వెళ్లాలంటే ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులరిజం గురించి మాట్లాడే ప్రభుత్వాల తీరులో ఇకనైనా మార్పు రావాలని దాసరి ప్రవీణ్ నేత గురుస్వామి కోరారు.