కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీవ్రమైన గాలులతో వర్షం కురవడంతో మొక్కజొన్న పంట నేల వాలిపోయాయి. అలాగే భారీ వర్షానికి గ్రామాల్లోని మురికి కాలువలు పొంగిపొర్లాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తమవుతున్నారు.
