కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పట్టణంలో మాతశిశు ప్రభుత్వ ఆసుపత్రి నందు మూడు రోజుల పాపను తేది 18-02-2024 రోజున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారని హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వగా కరీంనగర్ టౌన్ ఏసీపీ
గోపతి. నరేందర్ కరీంనగర్ టూ టౌన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓ.వెంకటేష్ తన సిబ్బందితో యుక్తముగా సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అట్టి పాపను ఎవరు తీసుకేల్లరో అని గుర్తించుటకు పీస్ కరీంనగర్ 2 టౌన్ సిబ్బంది, టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఎస్ బి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా
ఏర్పాటు చేయనైనది. నిర్మలా /o మనోజ్రామ్ వయస్సు 24 (సం) అసిఫ్ నగర్ గ్రామం కొత్తపల్లి (మం), కరీంనగర్ జిల్లా, నేటివ్ అఫ్ బీహార్ స్టేట్ అను ఆమె తనకు 16-02-2024 రోజున కరీంనగర్ మాతశిషు హాస్పిటల్ నందు తనకు ఒక ఆడ శిశువు పుట్టగా తన 3- రోజుల పాపను తేది 18-02- 2024 రోజున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారని పీస్ కరీంనగర్ 2 టౌన్ నందు ఫిర్యాదు
ఇవ్వగా కరీంనగర్ -2 టౌన్ పీస్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఓ. వెంకటేష్ కేసు నమోదు చేసి కరీంనగర్ టౌస్ ఏసీపీ ఆద్వర్యములో పీస్ కరీంనగర్ 2 టౌన్ సిబ్బంది, టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఎస్ బి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ లను పరిక్షించుతూ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ ల ద్వార పాపను తీసుకెళ్ళిన వ్యక్తిని గుర్తించి తక్కళ్ళపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లా లో బొమ్మ @ ముక్కెర కవిత@ పద్మ అశోక్, 35 (సం). లు, కులం: గౌడ్, తక్కళ్ళపల్లి అను ఆమెను పట్టుకొని విచారించగా ఆమెకు పిల్లలు లేనందున జమ్మికుంట లోని ఎర్రమరాజు జగ్గంరాజు నరసింహరాజు, వయసు : 75 కులం: బత్రాజు, వృతి: డీసీఎంహిచ్ జమ్మికుంట అను డాక్టర్ సలహా మేరకు కరీంనగర్ కి వచ్చి కరీంనగర్ మాతశిషు హాస్పిటల్ నందు ఎవరినైనా కిడ్నాప్ చేద్దామని పాప గురించి వెతుకుచుండగా ఒక బాబు వధ ఒక పాపా కనిపించగా అతనికి తెలుగు సరిగ్గా రానందున నేను పాపకి వాక్సిన్ వేసుకొని వస్తానని మాయమాటలు చెప్పి అతని వధ నుండి అట్టి పాపను తీసుకొని నడుచుకుంటూ ఆటో వద్దకి వెళ్లి ఆటో లో కరీంనగర్ బస్టాండ్ కి వెళ్లి అక్కడి నుండి జమ్మికుంట బస్సు లో వెళ్లి అక్కడ ఎర్రమరాజు జగ్గంరాజు అను డాక్టర్ కి చూపించగా అతను చూసి పాపకి పాలు తెప్పించి త్రాగించి పాపా భాగుందని చెప్పగా, అక్కడి నుండి పాపను తీసుకొని బస్ లో తన స్వగ్రామం తక్కళ్ళపల్లి కి వేల్లినానని, పాపను నా వద్దనే ఉంచుకొని పాపను నా స్వంత పనులకు, అవసరాల
నిమ్మితం వాడుకొని డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అట్టి పాపను ఎతుకొని వేల్లినానని ఆమె తెలిపినది. ఇట్టి అపహరణకు గురి అయిన పాపను గుర్తించడములో కరీంనగర్ టౌస్ ఏసీపీ జి. నరేందర్ కరీంనగర్ టు టౌన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ . వెంకటేష్ , జమ్మికుంట టౌన్ పీఎస్ సిఐ వి.రవి మరియు సిబ్బంది, టాస్క్ఫోర్స్ సిఐ కిరణ్ రెడ్డి మరియు సిబ్బంది మరియు ఎస్ బి సిబ్బంది చాకచక్యముగా వ్యవహరించి సీసీటీవీ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ ల ద్వార పాపను తీసుకెళ్ళిన వ్యక్తిని గుర్తించి అట్టి పాపను తన తల్లి ఒడికి చేర్చినారు. నేరస్తులను క్రైమ్ నంబర్ 151/2024 U/s: 363,363-A, 365 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపారు.