కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని వాటర్ ప్లాంట్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం గన్నేరువరంలో 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వాటర్ ప్లాంట్ మంజూరు వచ్చింది. అనంతరం దానిని మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు.కాగా 2023లో వాటర్ ప్లాంట్ మరమతుకు వచ్చింది. కానీ ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు వాటర్ ప్లాంట్ నీరు అందని దుస్థితి నెలకొంది. అసలే వేసవికాలం కావడంతో త్రాగునీటికి డిమాండ్ పెరిగింది. సంబంధిత అధికారులు ఈ వాటర్ ప్లాంట్ కు మరమతులు చేపట్టి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు