- దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కారంపూడికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు కొమ్ము. చంద్రశేఖర్ కుమార్తె కొమ్ము. కౌసల్య నియామకం
- నూతన పాలకమండలిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- చైర్మన్ గా దళిత మహిళకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి
పల్నాడు జిల్లా : మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మార్కెట్ యార్డ్ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి దళిత మహిళకు కేటాయించడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కారంపూడికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు కొమ్ము. చంద్రశేఖర్ కుమార్తె కొమ్ము. కౌసల్య ను చైర్మన్ గా నియమించారు. వైస్ చైర్మన్ గా కారంపూడి మండలం గాదెవారిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు గురజాల. రామారావును నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా బొల్లెద్దు. ఇన్నయ్య, చింత. లక్ష్మి నరసయ్య, కందుకూరి. కాసమ్మ, బోయిన. నరసమ్మ, రామావత్. లక్ష్మి భాయి, మాచర్ల. అన్నపూర్ణమ్మా, బైనబోయిన. గోపమ్మ, దేవరకొండ. సామ్రాజ్యం, బత్తుల. రాజమ్మ, షేక్. సన్నాయేల జనమ్మ, కాయిటి. వెంకటరెడ్డి, కాపలవాయి. సూర్యనారాయణ, చింత. చిన్న నరసింహరావు, లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నూతన చైర్మన్ కొమ్ము. కౌసల్య మాట్లాడుతూ దళిత మహిళను అయిన తనకు దుర్గి మార్కెట్ యార్డ్ పదవి కేటాయించిన పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి, పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి లకు ధన్యవాదములు తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలో ప్రభుత్వం ద్వారా అందే ఫలాలను ప్రతిఒక్క రైతుకు అందేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పాలకమండలి సభ్యులతో కలిసి పల్నాడు ప్రాంత రైతుల అభివృద్ధికి పాటుపడతానని నూతన చైర్మన్ కౌసల్య అన్నారు. తన తండ్రి కొమ్ము. చంద్రశేఖర్ మొదటినుంచి పిన్నెల్లి కుటుంబానికి విధేయుడిగా ఉండటమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియశిలక సభ్యునిగా కొనసాగుతుండటంతో నమ్ముకున్న కార్యకర్తకు న్యాయం జరిగింది అనడానికి తనకు దక్కిన పదవే ఒక ఉదాహరణ అని నూతన చైర్మన్ అన్నారు. ఇది ఇలా ఉండగా నూతన చైర్మన్ తో పాటు కొంతమంది దళిత నాయకులు ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.