సంగారెడ్డి : రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలను నీటి నుంచి నూతన మెనూ అమల్లోకి తీసుకు వచ్చిందని రాష్ట్ర అటవీ , పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంచరీ జూనియర్ కళాశాల (BRAC, TSWR JC Boys) ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు అందించే డైట్ చార్జీల పెంపు, కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి కొండా సురేఖ ,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో వసతి గృహాలలో ఈరోజు నూతన మెనూ ప్రకారం భోజనాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములు అయ్యారని అన్నారు. గురుకుల విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆడపిల్లలకు మంచి డైట్ ఇవ్వాలి, కానీ గత ప్రభుత్వం వారికి ఇవ్వలేదన్నారు . దీంతో బాలికలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు . 16 సంవత్సరాలుగా పెరుగని డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారద్యంలోని ప్రజా ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనంలో నూతన మెనూ ప్రకారం చికెన్, గుడ్డు, మటన్ లలో ఏదో ఒకటి ఉండేలా మెనును రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మెనూ ప్రకారం తప్పనిసరి భోజనాలు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వానికి పిల్లల ఆరోగ్యమే ముఖ్యం అన్నారు. నూతన డైట్ విధానం వల్ల ప్రభుత్వాన్ని పై కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ పిల్లలు ఆరోగ్యాన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు. గతంలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది, ప్రజా ప్రతినిధులదని అన్నారు. కాంట్రాక్టర్లు విద్యార్థులకు సరైన భోజనం అందించకుంటే వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రభుత్వం ను ఇలా అబాసపాలు చేయాలో చూద్దాం అని కాసు కూర్చున్నారు. ప్రిన్సిపల్ ప్రతిరోజు వంట తయారీ సమయాల్లో భోజన శాలను పరిశీలించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనలు సలహాలు తీసుకొని అధికారులు తనిఖీలు చేయాలన్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు అయ్యా అన్నారు. నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వం చిత్తుచిత్తులతో పనిచేస్తున్నట్లు తెలిపారు . బాగా చదివే విద్యార్థులని అందరూ అభినందిస్తారు. అలాంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పట్టుదల కృషి ఏకాగ్రత ఉంటే అనుకున్న గమ్యాన్ని సాధించవచ్చు అన్నారు. . పిల్లలను తల్లిదండ్రులు తిట్టవద్దు అని, మార్కులు రాకపోయినా బుజ్జాగించి నచ్చ చెప్పాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు చాలా సెన్సిటివ్గా తయారయ్యారన్నారు. పిల్లలతో కుటుంబ సభ్యులకు మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలి అన్నారు. అప్పుడే విద్యార్థులు మంచి నడవడికతో ఉత్తమ పౌరులుగా మారతారన్నారు. ఈ సందర్భంగా గురుకుల జూనియర్ కళాశాలలో స్టోర్ గదిని రికార్డులను మంత్రి పరిశీలించారు అనంతరం కళాశాల విద్యార్థులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు . వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడనున్నట్లు తెలిపారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి: జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాల విద్యార్థులు డైట్ చార్జీ లు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అన్నేలా చూస్తున్నదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలు, 16 సంవత్సరాల తర్వాత కాస్పెండెక్ చార్జీలు పెరిగాయి అన్నారు. దీంతో పాటు విద్యార్థులకు కామన్ మెనూ ప్రభుత్వం రూపొందించింది అన్నారు విద్యార్థిలకు పౌష్టికాహారం అందించేలా ఆకుకూరలు, గుడ్లు, చికెన్ ,మటన్, నెయ్యి పప్పు దినుసులు ఉండేలా ప్రభుత్వం కామన్ మెనూ రూపొందించింది అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు భోజనం అందించేలా చూడాల్సిన బాధ్యత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సంక్షేమ అధికారులదే అని అన్నారు. నేను ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెట్టకుంటే కఠిన చర్యలు తీసుకొని ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు హత్నూర సోషల్ వెల్ఫేర్ కళాశాలలో విద్యార్థులకు నీట్, ఐఐటి కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఐఐటి, ఎన్ఐటి ,నీట్ ర్యాంకుల సాధనలో హత్నుర్ కళాశాల సెటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిందన్నారు. గత ఏడాది కళాశాల నుండి ఐఐటి, ఎన్ఐటి ,నీట్ లలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పూర్తిగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు తాను సైతం సంక్షేమ వసతి గృహంలో చదువుకొని ఐఐటీలో 936 ర్యాంక్ సాధించి ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ లో ఐఏఎస్ గా ఎంపికైనట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ స్వప్న., ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ , ఆర్ సి లు, ఆర్ ఐ శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు , సంబంధిత అధికారులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు