ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం లోని కొండేపి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు.
జిల్లా కలెక్టర్ ,మంత్రి వీరాంజనేయ స్వామి వార్డులను పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్యులు అందిస్తున్న సేవలు తీరును , రోగుల పట్ల వైద్యుల ప్రవర్తన విధానాన్ని రోగులను అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిలోని పలు రికార్డులు, మందులను పరిశీలించారు.
పేద ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ఆశ్రయించేది ప్రభుత్వ ఆసుపత్రులనే
వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని,ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
విద్యా, వైద్యం, ప్రజారోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని,విధి నిర్వహణలో గాని సౌకర్యాల కల్పనాలలో గాని జాప్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, మంత్రి సిబ్బందికి తెలియజేశారు.