జగిత్యాల జిల్లా,కోరుట్ల: జాతీయ రహదారి భద్రత అవగాహన సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమం పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో గల గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఫ్లక్కార్డులు ప్రదర్శించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించింది. ఇట్టి కార్యక్రమంలో ఎం.వి.ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రహదారి భద్రత గురించి అవగాహన కల్పిస్తూ సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం డిఈఓ ఎంఈఓ సూచన మేరకు పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ శ్రీ జైనపురం ప్రవీణ్ కుమార్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు, ఇట్టి సదస్సుకు ముఖ్య అతిథులుగా మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి కోరుట్ల ఎస్సై శ్రీకాంత్, ఎస్సై రామచంద్రం పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు రహదారి భద్రత గురించి క్షుణ్ణంగా వివరించారు. అలాగే సైబర్ క్రైమ్ నేరాలను గురించి అవగాహన కల్పించారు. ఇట్టి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యానికి పోలీస్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీజైనాపురం ప్రవీణ్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి సూచనల విద్యార్థులు పాటిస్తూ తమ తల్లిదండ్రులు పాటించేలా చేయాలని రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఇట్టి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో పాఠశాల డీన్ నరసింహరాజు ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, కల్లూరు మాజీ సర్పంచ్ వన తరపున అంజయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.