జగిత్యాల జిల్లా, కోరుట్ల: మహిళ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోరుట్లలో “మై ఆటో ఇస్ సేఫ్” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆటో డ్రైవర్లను సన్మానించి, వారికి పోలీస్ శాఖ కవచాలు, మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. అనంతరం, ప్రయాణికుల భద్రత కోసం ఆటోలకు QR కోడ్ కలిగిన స్టిక్కర్లు అతికించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “జగిత్యాల జిల్లాలో మొత్తం 4000 ఆటోలు ఉన్నాయని, ఇప్పటి వరకు 2000 ఆటోలకు పైగా QR కోడ్ స్టికర్లు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ స్టికర్లు ప్రయాణికుల భద్రతను పెంపొందించడంలో సహాయపడతాయి, అలాగే ప్రయాణికులు తమ ఆటో డ్రీవర్ గురించి సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారు” అని చెప్పారు.
“మై ఆటో ఇస్ సేఫ్” కార్యక్రమం ద్వారా, ప్రయాణికుల భద్రత మరియు నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం కేవలం మహిళల భద్రతే కాకుండా, సమస్త ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం ఎంతో ఉపయోగకరంగా మారింది.
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ తదుపరి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నది, తద్వారా ప్రజల భద్రత పెరిగి, భద్రతాసంబంధమైన అవగాహనను మరింతగా ప్రోత్సహించగలుగుతాయి.