కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ కేంద్ర మంత్రివర్యులు, కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక కోట్ల క్యాంపూ కార్యాలయం నందు టిడిపి వ్యవ స్థాపకులు నంద మూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా టిడిపి నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ…
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన ప్రజల మనిషి నందమూరి తారక రామారావు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.