పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నాడు మూల నక్షత్రం సందర్భంగా 108 మంది కన్య బాలలచే కుంకుమ పూజలు జరిపించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం కన్యలకు సరస్వతి దేవి అలంకారం సందర్భంగా సురె అంజి ముచ్చర్ల రాంబాబు ఆధ్వర్యంలో కన్య బాలలకు, భక్తులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
