పల్నాడు జిల్లా , కారంపూడి: రేపటి సాయంత్రం నుంచి ఐదో తేదీ వరకు మండలంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కారంపూడి ఎస్సై కే అమీర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆదేశాల మేరకు మండలంలోని రేపు సాయంత్రం అనగా శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఐదవ తారీకు సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నందువలన షాపులు మూసి వేయడం జరుగుతుందని, ప్రజలు తమకు అవసరమైన నిత్యవసర వస్తువులను ముందుగానే సమకూర్చుకోవాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారికి సహకరించాలని కారంపూడి ఎస్సై అమీర్ సూచించారు. ఇప్పటికే కారంపూడి మండలంలో కొంతమందిపై బైండోవర్ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేశామని, మరికొందరిపై రౌడీషీట్లు తెరిచామని ఎన్నికల ఫలితాల వేల ఎవరైనా హింసకు పాల్పడిన, విజయవంతం ర్యాలీ నిర్వహించిన, బాణసంచా జరిపిన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైనా అల్లర్లలో పాల్గొంటే భవిష్యత్తు అంధకారమవుతుందని ఈ విషయం గుర్తుంచుకొని ప్రజలు విద్యార్థులు నడుచుకోవాలని ఆయన తెలిపారు.
