- కారంపూడి నుంచి పెనుగొండకు (300 కి.మీ) పాదయాత్ర చేస్తున్న ఆర్య వైశ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిని అభినందించిన కన్నా లక్ష్మీనారాయణ.
సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన వద్దకు కారంపూడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ లో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము వరకు 300 కి.మీ మేరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పాదయాత్రగా పెనుగొండ కు వస్తాను అని మొక్కుకొన్న కారంపూడి వాస్తవ్యులు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకులు కర్నాటి గోపాలకృష్ణమూర్తి తను చేపట్టిన పాదయాత్ర మూడవరోజు లో భాగంగా సత్తెనపల్లి పట్టణానికి చేరుకొన్నారు, ఈ సందర్బంగా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము వద్దకు చేరుకున్న సందర్బంగా పలువురు ఆర్య వైశ్య నాయకుల సమక్షంలో సత్తెనపల్లి శాసన సభ్యులు,మాజీ మంత్రి వర్యులు కన్నా లక్ష్మీనారాయణ కర్నాటి కి శాలువా కప్పి అభినందించారు. చిత్తశుద్ధితో తన మొక్కుబడిని 300 కిమి మేరకు పాదయాత్ర ద్వారా పెనుగొండ లోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నకు చేరుకోటానికి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో మొక్కుకోవటము ఆ మొక్కును తీర్చుకొనే దానిలో భాగంగా సత్తెనపల్లి చేరుకోవటాన్ని ఆర్య వైశ్య స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొన్నారు.Bకర్నాటి పలువురికి ఆదర్శం అని నాయకులు అన్నారు.