పల్నాడు జిల్లా కారంపూడి పట్టణమునందు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద సూరే. శశి కుమార్, గర్రె కళ్యాణ్ సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం 250 మందికి పులిహార, పెరుగన్నం , రవ్వ కేసరి , సూరే వెంకటేశ్వర్లు, గర్రె రామారావు కుటుంబ సభ్యుల సహకారంతో పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వారు మాట్లాడుతూ బైక్ మీద ప్రయాణం చేసేవారు హెల్మెట్ ను ధరించి సురక్షితంగా ప్రయాణం చేయాలని కోరడమైనది ఈ సేవ కార్యక్రమంలో డిస్టిక్ వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భవిరిశెట్టి రామారావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు దాతలు ముందుకు రావాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో గర్రె సుధాకర్, సూరే ఆంజనేయులు, ఇమ్మడిశెట్టి సత్యం, జిల్లా యువజన సంఘం నాయకులు సముద్రాల సాయి, జొన్నలగడ్డ సాయి, కరాలపాటి భిక్షాలు, చిన్ని లవన్ కుమార్, బొగ్గవరపు సుధీర్, సూరే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.