పల్నాడు జిల్లా, కారంపూడి : మండల కేంద్రంలోని ది హోలీ ఫెయిత్ ఫెలోషిప్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా ఒప్పిచర్ల గ్రామానికి చెందిన పాస్టర్ యం. సుదర్శన్ రావు, ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బుధవారం కారంపూడి లోని ఆదినారాయణ కాలనీ క్రీస్తు మహిమ ప్రార్ధనా మందిరంలో జరిగిన పాస్టర్స్ సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షుడిగా కొమ్ము జాకబ్, కార్యదర్శిగా బెన్సన్, సంయుక్త కార్యదర్శులు గా వై. రవికుమార్, పి. జోసఫ్, కోశాధికారిగా షేక్ .జానీ, కె.ఇమ్మానియేలు, గౌరవాధ్యక్షులుగా మాచర్ల ప్రకాష్ రావు, సలహాదారులుగా డి.భాస్కరరావు మాచర్ల ప్రకాష్ బాబు, కె.ఎస్. డేవిడ్ రాజ్, జి.రత్నకుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా కె. రవికుమార్, ఎల్.ఆనందరావు, రవి కుమార్, తదితరులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ పాస్టర్స్ సంక్షేమానికి ,అభివృద్ధికి, రక్షణకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ మేరకు ఫెలోషిప్ ఎన్నికల అధికారి మాచర్ల ప్రకాష్ రావు సమావేశ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారంపూడి మండలంలోని పాస్టర్స్ ఫెయిత్ ఫెలోషిప్ అందరు కలిసి నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన సుదర్శన్ రావు కు శుభాకాంక్షలు తెలిపారు.