- కారంపూడి పోలీస్ స్టేషన్లో విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు
రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికలను, పత్రిక ఆధిపతులను విలేకరులను దూషించినందుకు నిరసనగా గురువారం కారంపూడి పట్టణంలోని వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, నిరసన కార్యక్రమం చెప్పటారు. అనంతరం ర్యాలీగా తరలివెళ్లి కారంపూడి తాసిల్దార్ కార్యాలయంలో వినత పత్రాన్ని అందజేసి కారంపూడి పోలీస్ స్టేషన్లో విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ… విజయసాయిరెడ్డి మీడియా స్వేచ్చను హరించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే మీడియాపై, మీడియా అధిపతులు, విలేఖరుల మీద విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.