పల్నాడు, కారంపూడి : ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ట్రస్ట్ సహాయ సహకారాలతో కారంపూడిలో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కారంపూడి పట్టణంలోని ఆర్యవైశ్య వీధిలో గల శ్రీ సత్యసాయి బాబా ఆలయం ప్రాంగణంలో ఈ విచిత్ర రక్తనాళాల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి దాదాపు 200 మంది వరకు వృద్ధులకు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు మందులు అందజేశారు ఈ సందర్భంగా కొంతమంది ఆపరేషన్ తప్పనిసరి అనేవారికి సర్జన్ ఆపరేషన్ కొరకు రెండు రోజుల్లో వారి కొరకు హైదరాబాద్ లోని ఏషియన్ వాస్క్యులర్ హాస్పటల్ కి ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించి అన్ని ఖర్చులు శ్రీ సత్య సాయి ట్రస్ట్ వారిచే భరిస్తూ తిరిగి వారిని కారంపూడికి తిరిగి తీసుకురావడం జరుగుతుందని శ్రీ సత్య సాయి బాబా సేవా సమితి జిల్లా సభ్యులు తెలిపారు అనంతరం వైద్య పరీక్షల్లో పాల్గొన్న వారికి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు ఏసియన్ వాస్క్యులర్ హాస్పటల్ సిబ్బంది మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల పలనాడు జిల్లా అధ్యక్షులు కారంపూడి ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.