- ఓపెన్ టెన్త్ పరీక్షకు భారీగా వసూలు చేస్తున్న జెడ్ పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు
- బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్రమ వసూళ్లు… పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
- విద్యాశాఖ అధికారుల మౌనంపై అనుమానాలు
- ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు 10,000 రూపాయలు వసూళ్ళు
పల్నాడు జిల్లా / కారంపూడి : బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు దర్జాగా ఓ ఉపాధ్యాయుడు భారీ వసూళ్ళకి పాల్పదుతున్నాడు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వానికి కట్టవలసిన ఫీజు 800 నుండి 1000 రూపాయలు ఉండగా ఓ ఉపాధ్యాయుడు ఏకంగా 10,000 రూపాయలు వసూలు చేయటం మొదలుపెట్టాడు. ఇదేమని ప్రశ్నిస్తే పదివేలు ఇస్తేనే ఎగ్జామ్ లేదంటే మరి ఎక్కడైనా రాసుకోండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో జిల్లా అధికారులపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదేమని ప్రశ్నిస్తే మా బాధలు మీకేం తెలుసు .. కింద స్థాయి అధికారులు నుండి పై స్థాయి అధికారుల వరకు ముడుపులు చెల్లించాలని మాకు అధికారులు వసూల్ టార్గెట్ ఇచ్చారని, ఎవరి వాటా వారికి వెళుతుందని, మీరు ఎవరికీ ఫిర్యాదు చేసినా ఎవరు ఏమి చేయరని, ఆఖరికి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఒరిగేది ఏమిలేదని దురుసుగా సమాధానమివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందులో ఎవరి వాటా ఎంతో తెలుసుకునే పనిలో పడ్డారు రిపోర్టర్ టివి ప్రత్యేక టీమ్. కలెక్టర్ వాటా ఎంత ? డీఈవో వాటా ఎంత ? ఎంఈవో వాటా ఎంత ? ఎవరెవరి వాటా ఎంతో త్వరలోనే దర్యాప్తు కథనంతో మీ ముందుకొస్తుంది రిపోర్టర్ టీవీ.