పల్నాడు జిల్లా కారంపూడి : వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలకి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎటువంటి రాగ ద్వేషాలకి తావివ్వకుండా చూసుకోవాలని,సంతోషకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు
నిర్వహణ కమిటీ తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పండుగ రోజు నుండి నిమజ్జనం వరకు మండపం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.