పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ వద్ద రెండవ పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలలో భాగంగా వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12.00 నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభవుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మండలంలోని ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల భక్త మహాశయలు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు.