పల్నాడు జిల్లా కారంపూడి లో అత్యంత ప్రమాదకర మత్తు పదార్థం గంజాయి అమ్మకాలు, వాడకాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి మత్తుకు యువకులు, కార్మికులు బానిసలుగా మారి తమ విలువైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మండలంలో ఏదో ఒక ప్రాంతంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు దొరుకుతూనే ఉన్నాయనే సమాచారం తో కారంపూడి సిఐ టి.వి.శ్రీనివాస రావు ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. అసలు గంజాయి ఎక్కడ నుండి వస్తోంది? ఎవరు అమ్ముతున్నారు? ఏమిటి అనే విషయాలపై ప్రత్యేక నిఘా పెట్టి, పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి అమ్మకాలను, గంజాయి రవాణాకు చెక్ పెట్టారు.
కారంపూడిలో గంజాయి అమ్ముతున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ఒక కేజీ రెండు వందల గ్రాముల గంజాయిని సీజ్ చేసారు . గంజాయి అమ్ముతున్న కాల్వ మహేష్ అనే వ్యక్తిని విచారించగా మాచర్ల కు చెందిన లక్ష్మీ, శివ నాగమణి మహిళ వద్ద తను తీసుకొచ్చినట్లుగా తెలపడంతో ఆమెను కూడా అదుపులోకి కేసు నమోదు చేసారు.
ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కారంపూడిలో గంజాయి అధికంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని దానిలో భాగంగా తన సిబ్బందితో నిఘా పెట్టడంతో మహేష్ పట్టుబడినట్లు తెలిపారు. కారంపూడి లోని మరికొందరిపై కూడా నిఘా ఉన్నట్లు త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకొని గంజాయి రహిత కారంపూడిగా తీర్చిదిద్దుతామని సీఐ తెలిపారు. నిందితులకు గురజాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు సమాచారం.