కారంపూడి మండలంలోని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా కారంపూడిలో భారీగా ఏర్పాటు చేసిన బేకరీను ప్రారంభించారు. అనంతరం స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పిన్నెల్లి శ్రీవిద్య అందించిన టీషర్టులను క్రీడాకారులకు బహుకరించారు. ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ విద్యా బోధన చేయగల టీచర్లు ఉన్నారని విశాలమైన ఆట స్థలం తో పాటు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చదువుల్లో ప్రస్తుతం బాలికలదే అగ్రస్థానం అని బాలికలతో పాటు పోటీపడి బాలురు సైతం చదవాలని సూచించారు కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడి విద్యను దూరం చేసుకుంటున్నారని భవిష్యత్తులో విద్య ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించి బాలికలతో పోటీపడి బాలురు సైతం విద్యను అభ్యసించాలని కోరారు.
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ శివారులోనీ చిరుమామిళ్ల సుబ్బయ్య పొలంలో పొలం పిలుస్తుంది రా కార్యక్రమంలో కంది చేలో ఎద్దులతో దుక్కి దున్ని రైతులని ప్రోత్సహించారు అనంతరం పొలం పిలుస్తుంది రా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ “పొలం పిలుస్తోంది…రా ” కార్యక్రమం రైతులకు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు తోడ్పడుతుంది. ఆధునిక సేద్యంపై ఏ విధంగా అడుగులు వేయాలో రైతులకు అర్థమయ్యేలా వివరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రతి రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉన్నం. లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంగులూరి.అంజయ్య, పంగులూరి. పుల్లయ్య, చప్పిడి రాము, గోళ్ళ సురేష్ యాదవ్, బొల్లినేడి శీను, జనసేన సమన్వయకర్త బుసా రామాంజనేయులు, కేసనపల్లి. కృష్ణ బాబు, మునుగోడు సత్యం, నీళ్ల అంజయ్య, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, కొండపల్లి. అప్పారావు, చిరుమామిళ్ళ శ్రీను, బొల్లినేని హరికృష్ణ, పంగులూరి. లక్ష్మయ్య, కిలారి పవన్, వట్టికొండ పెద్దబ్బాయి, చిరుమామిళ్ల రామ లక్ష్మయ్య, బోలినేడి మల్లికార్జునరావు, ఎంపీడీఓ గంట శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మండల అధికారి యలమందారెడ్డి, ఏపీఓ కోటిరెడ్డి, మరియు వ్యవసాయ శాఖ అధికారులు, కూటమీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.