కారంపూడి: కారంపూడి గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గం మాదిగ కులస్తులకు సంబంధించిన స్మశానం రక్షణ సమస్యలు ఎదుర్కొంటోంది. గ్రామంలోని స్మశానానికి ప్రహరీ గోడ లేకపోవడం వల్ల కబ్జాలకు గురవుతున్నట్లు గ్రామసభలో వెల్లడించారు.
సర్పంచులు మారినా, స్మశానం గురించి పట్టించుకునే నాధుడు లేనందుకు నిరసన వ్యక్తం చేసిన నాయకులు, “మా స్మశానం రక్షించాలి, లేకపోతే ఉన్న స్థలం కూడా కబ్జాలకు గురి అవుతుంది” అని అన్నారు.
ఈ సందర్భంగా, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన స్మశానానికి ప్రహరీ గోడ మంజూరు చేయాలని వారు కోరారు. ఈ విషయమై అర్జీ పత్రాన్ని గ్రామసభలో సర్పంచి మరియు పంచాయతీ సెక్రెటరీకి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ నాయకులు కాలవ పేరయ్య, కాలవ కృష్ణ, శంకర దాసు, జనసేన నాయకుడు పాలుపోగు బాబు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మస్తాన్ జాని, ప్రహరీ గోడ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు