పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ధర్మపత్ని శోభారాణి ను కమిటీ వారుపూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు .ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దేవాలయ అర్చకులు సాయి మణికంఠ వేదమంత్రాలతో ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించి దేవస్థాన అధ్యక్షులు చీతిరాల వెంకట కోటేశ్వరరావు మరియు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి, ఆర్యవైశ్య మహిళా కమిటీ అధ్యక్షురాలు ఇమ్మడిశెట్టి కోమలి మరియు మహిళా సభ్యులు ఎమ్మెల్యే ధర్మపత్ని శోభారాణిను సత్కరించారు మహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వద్ద పూజా కార్యక్రమాల పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా భరత నాట్య కార్యక్రమాన్ని తిలకించి పిల్లలను అభినందించారు. అనంతరం శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లి దేవస్థానములో పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వాసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ వాసవి ఆర్యవైశ్య దేవస్థాన కమిటీ, ఆర్యవైశ్య మహిళా కమిటీ, శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం, మండల ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి సేవాదళ్ మహిళా కమిటీ, కారంపూడి మండల మరియు పట్టణ ప్రజలు, భక్తులు, మహిళా భక్తులు, కారంపూడి మండల మరియు పట్టణ ఎన్ డి ఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు