పల్నాడు జిల్లా, కారంపూడి : మండల కేంద్రంలో భారత్ గ్రామీణ్ బంద్ ను కార్మిక సంఘాల సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు కారంపూడి నాగులేరు బ్రిడ్జి వద్ద సిపిఐ ,ఏఐటియుసి , సిపిఐ ఎంఎల్ ,రైతు కూలీ సంఘం ,సిఐటియు సంఘాలు రాస్తారోకో చేయడం జరిగింది.
గ్రామీణ బంద్ ను ఉద్దేశించి కారంపూడి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు మేము గెలిస్తే కోటి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలను వడ కొట్టడం జరిగింది ,అలాగే దేశంలో కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లు విభజించి కార్మికులకు శాపంగా మారింది అని అన్నారు.ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్నవిశాఖ ఉక్కును ప్రవేట్ పరం చేయాలని చూస్తున్నది.
ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని ఆయన అన్నారు. అలాగే వ్యవసాయానికి రైతులకు సంబంధించి రుణాలు కలిపించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నకు నిధులు సమకూర్చాలని కోరారు., కార్మికులకు కనీస వేతనం 26000 ఇవ్వాలని ఆయన కోరారు, నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించి పేదవారికి అండగా నిలవాలని ఆయన అన్నారు, లేనిపక్షంలో 2024 ఎలక్షన్లో ప్రజలందరూ మోడీ గారిని గద్దె దించడానికి పూనుకున్నారని అన్నారు.
సిపిఐ ఎంఎల్ నాయకురాలు జక్కంపూడి పద్మ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఉపాధి హామీ పథకం రోజుకు కనీసం 600 రూపాయలు ఇవ్వాలని రెండు వందల రోజులు పనులు కల్పించాలని రాజధాని నిర్మాణానికి మోడీ నిధులు సమకూర్చాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ శ్రీనివాస్ రావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కూరాకుల వెంకట శివయ్య ఒప్పిచర్ల శాఖ కార్యదర్శి ఇందూరు శ్రీనివాసరావు సుభాని నూనె వెంకటేశ్వర్లు కారంపూడి పట్టణ కార్యదర్శి సూర్య హనుమంతరావు ఏఐవైఎఫ్ నాయకులు జింకల కోటేశ్వరావు సైదాబీ అలాగే సిపిఐ ఎంఎల్ నాయకులు రామ్మూర్తి శ్రీనివాస్ రెడ్డి సుబ్బారావు కోటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు.
బైట్ : కారంపూడి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి షేక్ సైదా