పల్నాడు జిల్లా, కారంపూడి : గురజాల సబ్ డివిజన్ పరిధిలోని కారంపూడి సర్కిల్ సీఐగా నారాయణస్వామి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కారంపూడి సర్కిల్ పరిధిలో ఎవరైనా గొడవలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు . గతంలో కారంపూడి ఎస్సై గా నారాయణ స్వామి విధులు నిర్వహించారు. కారంపూడి కి సిఐ గా రావడం విశేషం.
