పల్నాడు జిల్లా, కారంపూడి : నిన్న రాత్రి కారంపూడిలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న టిడిపి శ్రేణులను సిఐ మల్లయ్య బెదిరించారు. తుపాకీ చూపించి మరీ .. టిడిపి శ్రేణులను దుర్భాషలాడారు. తుపాకీ ఎందుకు తీశారు అని ప్రశ్నించిన టిడిపి శ్రేణుల పై ఎదురుదాడి చేసారు. చప్పిడి రాము అనే టిడిపి నేతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా . బిజెపి , టిడిపి , జనసేన నేతలు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో చప్పడి రాము ను వదిలిపెట్టారు పోలీసులు.
సిఐ మల్లయ్య తీరుపై ఈరోజు మాచర్ల పట్టణం లో ఆర్ ఓ కి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదులో పొందుపర్చిన విషయము .. చప్పిడి రాము మీద చేసిన దౌర్జన్యకాండ కు మరియు పబ్లిక్ స్థలంలో సీఐ మల్లయ్య రివాల్వర్ తీసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసారని, చప్పిడి రాము కుటుంబాన్ని బూతు పదాలతో దూషించారని, కారంపూడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి రాము ని బండబూతులు తిట్టి, కొట్టారని, సీఐ మల్లయ్య పై చర్య తీసుకోవాలని ఆర్ ఓ ని కోరాను.
ఈ కార్యక్రమంలో మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజేషన్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, కారంపూడి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు చప్పిడి రాము, మాచర్ల నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు మూడవత్ వజ్రం నాయక్,మాచర్ల నియోజకవర్గ జనసేన అధ్యక్షులు బుస్సా రామాంజనేయులు, జనసేన మాచర్ల టౌన్ నాయకులు కొమరా లాల్ కృష్ణ, పల్నాడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పిన్నంశెట్టి కృష్ణ, కారంపూడి టౌన్ జనసేన నాయకులు కృష్ణ, తిక్క కొండల పాల్గొన్నారు.