పల్నాడు జిల్లా కారంపూడి మండలం: నూతన ప్రెస్ కమిటీ ఎన్నిక కార్యక్రమం శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో పలు దినపత్రికలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు పాల్గొని కారంపూడి మండలం నూతన ప్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు సాక్షి పత్రిక విలేకరి దేవిశెట్టి. శ్రీనివాసరావు ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవిశెట్టి. శ్రీనివాసరావు సూదీర్ఘకాలంగా పాత్రికేయ వృత్తిలో పనిచేస్తూ కారంపూడి మండలంలో మంచి పేరు సంపాదించారు. సీనియర్ సభ్యులు కావడంతో సమావేశంలో పాల్గొన్న పాత్రికేయులు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవిశెట్టి. శ్రీనివాసరావు గత 30 సంవత్సరాల నుంచి ఏపియుడబ్లుజే యూనియన్ లో క్రియశిలక సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవిశెట్టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని త్వరలో సభ్యులందరితో చర్చించి ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకు కూడా తనవంతు కృషి చేస్తానని తన మీద నమ్మకంతో తనను ఎన్నుకున్న సభ్యులకు ఈ సందర్బంగా అయన ధన్యవాదములు తెలిపారు. కారంపూడి మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన దేవిశెట్టి. శ్రీనివాసరావు కు కారంపూడి ఎంపీపి బొమ్మిన. సావిత్రి అల్లయ్య శుభాకాంక్షలు తెలిపి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కారంపూడి మండల పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని నూతన అధ్యక్షులు తెలిపారు. ఈ సమావేశంలో పాత్రికేయులు పాల్గొన్నారు.