కృష్ణాజిల్లా:విజయవాడలోని ఒక ప్రైవేట్ కళాశాల నందు బీటెక్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సరదాగా మంగినపూడి బీచ్ నందు కేరింతలతో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా అలల ఉధృతికి లోతునకు కొట్టుకుపోయారు. బీచ్ పరిసరాల్లో విధుల్లో ఉన్న బందరు తాలూకా పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్- 556 నాగరాజు కొట్టుకుపోతున్న ముగ్గురిని గమనించి, బీచ్ ఒడ్డున స్థానికంగా ఉన్న జాలర్ల, స్థానికుల సహాయం తీసుకుని, తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తనవద్ద ఉన్న ఒక తాడును తీసుకుని ఒక చివర నడుముకి కట్టుకొని, మరొక చివర ఒడ్డున ఉన్నవారికి పట్టుకోమని ఇచ్చి సముద్రం లోపలికి వెళ్లి కొట్టుకుపోతున్న ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
అలల తాకిడికి తట్టుకోలేక లోపలికి కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులని కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సురక్షితంగా ఒడ్డుకి చేర్చడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పిలుచుకున్నారు. ముగ్గురు విద్యార్థులు యొక్క ఆరోగ్యం నిలకడగా ఉండడంతో, వారికి కొద్దిసేపు విశ్రాంతి అందించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాటు చేశారు.