కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించే రోజులు పోయి….ఈజి మనీ కోసం ఎదుటి వాడికి ఐపి అంటూ పాంగనామం పెట్టె రోజులు ఇవి….అత్యాసాకు పోయి భూమిలో నిధులు కోసమో లేక వేరే ఏమైనా కారణమో? క్షుద్రపూజలకు ఏర్పాట్లు చేయబోగ .. సీన్ రివర్స్ కట్ చేస్తే..కట కటల్లోకి?
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేప్టట్టారు. అనంతపురం జిల్లా అనగాని దొడ్డి గ్రామము లోని నిర్మానుష్య ప్రాంతంలో క్షుద్ర పూజలకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడేం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అక్కడ చుట్టూ పరిశీలించగా వారు క్షుద్రపూజలకు సంబంధించిన ముగ్గు వేసి అందుకు నిమ్మకాయలు, ఇతర వస్తువులను గుర్తించారు. వెంటనే వారిని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.