contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో గెలవడం కోసం గట్టి పోరాటం చేయాలి : కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని… 420 హామీలని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చలేక… అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :