మానవత్వం ఉన్న నాయకుడెవరూ వికృత చేష్టలకు పాల్పడడని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడన్నల పట్ల ఆయన దుర్మార్గంగా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు. గంటల తరబడి గౌడన్నలను చెట్ల మీద ఉంచడం సరికాదన్నారు.
‘మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడ’ని నిప్పులు చెరిగారు . గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గమన్నారు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్‌లో ఉంటుందని ఎద్దేవా చేశారు. మీ మతిలేని చర్యలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయని పేర్కొన్నారు.