- హుస్నాబాద్ అంత గులాబీమయం
- హుస్నాబాద్ అభివృద్ధి కి మరో 25 కోట్ల రూపాయలు మంజూరు
- వచ్చే ఎన్నికల్లో సతీష్ కుమార్ ని 1లక్ష మెజారిటీతో గెలిపించాలి
- ప్రజా ఆశీర్వాద సభ లో మంత్రి కేటీఆర్
- సీఎం కేసీఆర్ కి హుస్నాబాద్ నియోజకవర్గం లక్ష్మి నియోజకవర్గం
సిద్ధిపేట జిల్లా: మంత్రివర్యులు కేటీఆర్ హుస్నాబాద్ కు విచ్చేసిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణం మొత్తం గులాబీమయం అయింది. హుస్నాబాద్ మొత్తం జన సందోహం నెలకొంది. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువత భారీ సంఖ్యలో హుస్నాబాద్ లో కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ లో పర్యటించి మొదటగా 1కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని,2కోట్ల25 లక్షలతో నిర్మించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్,1కోటి రూపాయలతో నిర్మించిన ఎస్టీ ఉమెన్స్ హాస్టల్,16 కోట్ల 46 లక్షలతో నిర్మించిన రెండు పడకల ఇండ్లను2 కోట్లతో నిర్మించిన టిటిసి సెంటర్ ను10 లక్షలతో నెలకొల్పిన బస్తీ దావఖానా ఒక కోటి 20 లక్షలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అలాగే మూడు కోట్ల. యాబై లక్షలతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం అభివృద్ధి పనుల విలువ 27 కోట్ల 51 లక్షలు. అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో గ్రౌండ్లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…
హుస్నాబాద్ డిపో గ్రౌండ్ అంత గులాబీ మయం అయిందని ఈ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే అజాతశత్రువు, చీమకు కూడా హామీ చేయరని మంచి మనిషి అని, కానీ పని విషయంలో చాలా ఘటికుడని, పని కావాలంటే వెంటపడి మరి సాధించుకుంటారన్నారు. హుస్నాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, ఒకప్పుడు మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, అలాగే కేసీఆర్ పథకాలు అందని ఇల్లు హుస్నాబాద్ నియోజకవర్గం లో లేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కల్పవల్లి గౌరవెల్లి ప్రాజెక్టు అన్నారు, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని పూర్తి చేశారని, గోదావరి జలాలతో తెలంగాణ రైతుల కాళ్లు కడిగారని అన్నారు. గత ప్రభుత్వాలు కనీసం 6 గంటలు కరెంట్ ఇవ్వలేదని కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుందని అన్నారు. తండావాసులతో మాట్లాడి నీళ్లు వస్తున్నాయా అడుగుతే వారు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎట్ల నీళ్లు వస్తున్నాయో మా బంజారా తండాలలో ఆ విధంగానే నీళ్లు వస్తున్నాయని సంతోషంగా చెప్పారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 11 తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయని,నియోజకవర్గంలో 11,000 మందికి కళ్యాణ లక్ష్మి వచ్చిందని అన్నారు. సతీష్ కుమార్ ని ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి అని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికిప్పుడే హుస్నాబాద్ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 25 కోట్లు మంజూరు చేస్తున్నానని సభా వేదికగా కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ భవనం, జూనియర్ కాలేజ్ భవనం, హాస్పిటల్ ,ఇండోర్ స్టేడియం ఇట్లా… చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపైనా సరిపోదు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ చేసిన అభివృద్ధి గురించి అని కితాబు ఇచ్చారు. సతీష్ అన్న చాలా మంచోడని చల్లని మనిషిని అన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ…
కేటీఆర్ మే 5న హుస్నాబాద్ కు వస్తున్న అని చెప్పిన సందర్భంలో నేను చాలా ఆలోచించాను, ఏర్పాట్లు పూర్తి అవుతాయా లేదా అని…. కానీ నా యొక్క కార్యకర్తలు, అభిమానులు అందరూ సమన్వయంతో పనిచేసి, యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసి సహకరించారని అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న అన్నారు. మనకు ముగ్గురు మంత్రుల అండ ఉంది అని హరీష్ రావు, గంగుల కమలాకర్, కేటీఆర్ … అన్న నాకు ఈ పని ఉంది అని అడగగానే గడప దాటకముందుకే పని చేసి పెడతారని అన్నారు. శనిగరం ప్రాజెక్టుకు నిధులు కావాలని గౌరవ కేసీఆర్ ని కలిస్తే 22 కోట్లు విడుదల చేశారని, సింగరాయ ప్రాజెక్టుకు ఐదు కోట్లు మంజూరు చేశారని, మిడ్ మానేరు ఎడమ కాలువ ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు 200 ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయని, అలాగే కాకతీయ కాలువ ద్వారా 6 గ్రామాలు దేవాదుల నుండి భీమదేవరపల్లి , ఎల్కతుర్తి మండలాలలో లో పదివేల ఎకరాలు సాగు అవుతుందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయిందని సీఎం కేసీఆర్ తో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 161 గ్రామాలు హుస్నాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అలాగే, హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామ, గ్రామాన సిసి రోడ్లు పూర్తయ్యాయని, కొండాపూర్, వెన్నంపల్లి గ్రామాలకు అవార్డులు కూడా వచ్చాయని, హుస్నాబాద్ మునిసిపాలిటీకి కూడా జాతీయ అవార్డు వచ్చిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాకు మాటలు చెప్పడం రాదు, చేతలు మాత్రమే తెలుసు అని అన్నారు. 10 కోట్లు, అడిగితే 20 కోట్లు కేటీఆర్ ఇచ్చారని, అలాగే మున్సిపల్ అభివృద్ధి కోసం 12 కోట్లు కేటాయించారని చెప్పారు అలాగే గౌరవ మా కేటీఆర్ కి కొత్తపల్లి నుండి జనగాం హైవే ఇవ్వండి అని ఎమ్మెల్యే కోరగా వెంటనే మంజూరు చేపిస్తాను అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు బి. వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ రమణ మరియు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డా. సుదీర్ కుమార్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణా రావు, హుస్నాబాద్ నియోజకవర్గ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ అధ్యక్షులు సింగిల్విండో చైర్మన్లు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.