కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రారంభించారు. వైద్యాధికారులు, గ్రామ సర్పంచ్ పర్యవేక్షణలో సిగ్మా రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ అధ్వర్యంలో ముగ్గురు సభ్యులు బృందం గ్రామాలలో ఇంటింటికి వెళ్లిs ఆరోగ్య పరిస్థితులు తోపాటు వివిధ అంశాలపై క్షేత్ర స్తాయి కార్యచరణ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సూపర్వైజర్ నూకరాజు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆరవ విడత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే అనంతరం నమోదు చేసిన నివేదికను ఇంటర్నేషనల్. ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్(IIPS) ముంబై, కు నివేదించడం జరుగుతుందని తెలిపారు.
ఫీల్డ్ వర్క్ యొక్క మొదటి దశ ఎంపిక చేయబడిన నమూనా గ్రామం(లు)/పట్టణంలోని ఇంటి మ్యాపింగ్ మరియు జాబితాను కలిగి ఉంటుంది.
బ్లాక్(లు) ఇది నిర్దేశిత సర్వే షెడ్యూల్‌లలో సమాచారాన్ని సేకరించేందుకు కుటుంబాల ఎంపిక కోసం ఒక ఫ్రేమ్‌గా పనిచేస్తుంది.సర్వే చేసి నమోదు చేసిన నివేదికను IIPS కు అందించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో సర్వే సభ్యులు కె నూకరాజు ఎస్ దేముడు గ్రామ సర్పంచ్ ఎం అరుణ్ కుమార్ ఏ ఎన్ ఎం -1 సురేఖ, ఏ ఎన్ ఎం -2 నాగలక్ష్మి, ఎఎం ఎల్ హెచ్ పీ -1 శ్రీవాణి ఎం ఎల్ హెచ్ పీ -2 హర్ష వర్ధన్ ఆశా వర్కర్లు కాంతమ్మ, రాజమ్మ, నాగేంద్రమ్మ, సుధారాణి, ఎల్లమ్మ,లక్ష్మి,జానకి, జ్ఞానేశ్వరి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.