కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రికి సమాధి కట్టే విషయంలో అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ తమ్ముడి ప్రాణం మీదికి తెచ్చింది. వివరాల్లోకి వెళితే పెద్దయ్య, రంగస్వామి అన్నదమ్ములు. గత కొంత కాలం క్రితం తండ్రి ఆంజనేయ మరణించడంతో వారికి ఉన్న పొలంలో తండ్రి అంత్యక్రియలు చేసారు. అప్పటి నుండి ఆ తండ్రి సమాధి కట్టించాలని చిన్న కొడుకు పెద్దయ్య ఇసుక, రాళ్లు తెస్తుంటే పెద్ద కొడుకు రంగస్వామి మాత్రం వద్దు అంటూ అడ్డుకుంటున్నాడు. అయినా కానీ చిన్న కొడుకు పెద్దయ్య వినకుండా తండ్రి సమాధి కట్టించాలని పనులు చేస్తుంటే ఆగ్రహించిన రంగస్వామి దారిలో కాపుకాసి విచక్షణారహితంగా దాడి చేసి చంపాలనుకున్నారు. ఈ దాడికి రంగస్వామి భార్య లక్ష్మి, కుమారుడు సహకరించినట్లు తెలుస్తుంది.
ఈ దాడిలో పెద్దయ్య రెండు చేతులు పూర్తిగా విరిగాయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పోలీసువారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.