కర్నూలు జిల్లా, మంత్రాలయం: పెళ్లి వేడుకలలో ఒక తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి తంతులో భాగంగా స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ, డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపిన వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోసిగి 9వ వార్డుకు చెందిన వీరేష్ అనే వ్యక్తి ఆదోని మండలంలోని కుప్పగల్లు గ్రామంలో తన బంధువుల పెళ్లికి వెళ్లాడు. వీరేష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరేష్ మృతితో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.