ఆంధ్రప్రదేశ్ / ఢిల్లీ : ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరడంతో ఆ పార్టీ నేతలకు కేంద్రంలో ప్రాముఖ్యత పెరిగినట్లుగా కనబడుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండగా, తాజాగా, ఐదుగురు టీడీపీ ఎంపీలకు పార్లమెంట్ కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటు దక్కింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అంచనాల కమిటీలో పార్ధసారధి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే టీడీపీకి ఒక మంత్రిత్వ శాఖ స్థాయూ సంఘం చైర్మన్ పదవి కూడా లభించే అవకాశం ఉందని టాక్ నడుస్తొంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ చంద్రబాబు, నితీశ్ పై ఆధారపడి ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు.