కరీంనగర్ జిల్లా: దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండి) లో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక మహిళ ముగ్గురు మైనర్ బాలికను లేక్ పోలీసులు రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి
కరీంనగర్ మండలంలోని బాబుపేట గ్రామానికి చెందిన సంపంగి కవిత (28) ఆమెకు చెందిన ముగ్గురు మైనర్ పిల్లలుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడేందుకు డ్యాం నీటిలోకి దిగుతుండగా గస్తిలో ఉన్న లేక్ పోలీసులు గుర్తించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి నిలువరించారు. కుటుంబ ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు విచారణలో చెప్పారు. లేక్ అవుట్ పోస్ట్ ఆర్ఎస్ఐ ఏ సురేష్ సదరు మహిళ, మైనర్ పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీస్ కమీషనర్ రివార్డ్ ప్రకటన
ఆత్మహత్యానికి పాల్పడిన ఓ మహిళ, మరో ముగ్గురు మైనర్ బాలలను రక్షించిన లేక్ పోలీస్ ఎస్ఐ సురేష్, హోంగార్డు ఆంజనేయులకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు రివార్డును ప్రకటించారు.